టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, విధ్వంసం..

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది… ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి… మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది.. గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి.. వైసీపీ సర్కార్‌, సీఎం వైఎస్‌ జగన్‌పై ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. గంజాయి విషయంలో టీడీపీ నేతలకు నోసులు ఇవ్వడంపై స్పందిస్తూ.. సీఎంను టార్గెట్‌ చేశారు పట్టాభి.. ఇక, ఆ వ్యాఖ్యలకు నిరసనగా పట్టాభి ఇంటిపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు వైసీపీ శ్రేణులు.. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల ఎదుట వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. వెంటనే పట్టాభి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles