గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. రేపే 2,48,468 మంది ఖాతాల్లోకి సొమ్ము..!

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాలు ఎక్క‌డా ఆగ‌కుండా.. ఇంకా సాధ్య‌మైనంత ముందే అమ‌లు చేస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. మంగ‌ళ‌వారం రోజు వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయ‌నున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,48,468 మంది ల‌బ్ధిపొంద‌నున్నారు.. ఇక‌, ఈ పథకం అమ‌లు చేసేందుకు రూ.248.47 కోట్లు వెచ్చిస్తోంది ఏపీ స‌ర్కార్.. ఒక్కో లబ్ధిదారుని ఖాతాలో రూ. 10,000 చొప్పున జమ చేయ‌నుంది ఏపీ ప్ర‌భుత్వం.. ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించ‌నుంది స‌ర్కార్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-