రేపే వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల జమ..

కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది… దీని కోసం రూ.490.86 కోట్ల ఖర్చు చేయనుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. ఇక, పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో ఈ సొమ్ము సమ కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-