జగనన్న బాణం.. నిజంగానే ఒంటరా?

వైఎస్ షర్మిల.. గతంలో జగనన్న బాణం. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ.. అధికారం లక్ష్యంగా సాగుతున్న పయనం. ఆమె అడుగులు ఎక్కడివరకూ పడతాయి.. లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక.. చతికిలబడతారా.. అన్నది పక్కన బెడితే.. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ మాత్రం.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఒంటరినైపోయానంటూ.. ఆమె వైఎస్ ను తలుచుకోవడం.. చర్చనీయాంశమైంది.

ఇక్కడే… ఓ విషయాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. జగన్ సైతం వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత.. ఒంటరిగా నిలిచారని.. ఆ సమయంలో.. వైఎస్ విజయమ్మ ప్రతి సందర్భంలో తన కుమారుడికి అండగా నిలిచి.. ముందుకు తీసుకువెళ్లారని వైఎస్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా.. తెలంగాణ రాజకీయ బరిలో దిగిన షర్మిలకు వైఎస్ సహచరి విజయమ్మ తోడుగానే నిలుస్తున్నారు. తన కుమార్తెను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు.

విజయమ్మ తోడుగా నిలిస్తే.. వైఎస్ఆర్ తోడుగా ఉన్నట్టే అని షర్మిలకు ఆమె సహచరులు సైతం ధైర్యం చెబుతున్నారట. అంతే కాకుండా.. తెలంగాణ రాజకీయాలను వద్దనుకున్నారు కాబట్టి.. జగన్.. ఈ విషయంలో పట్టించుకోవడం లేదని.. ఏపీ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఓ అన్నగా ఆయన మాట్లాడినప్పుడు కచ్చితంగా తన అభిప్రాయాలు చెప్పి తీరతారని.. రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో.. షర్మిల సైతం ఓ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ రాజకీయాలు చేస్తున్నాయి. వారితో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని.. కాంగ్రెస్, బీజేపీ శక్తులను దాటి.. తెలంగాణలో వేళ్లూనుకోవాలంటే.. షర్మిల కచ్చితంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది.

ఆ దిశగా కూడా.. ఆమె ఆలోచన చేస్తే.. షర్మిల ఎప్పటికీ ఒంటరి కాబోదని.. ఆమె శక్తికి సైతం ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న కాలంలో అయినా కాస్త ప్రభావాత్మకత అన్నది చేకూరుతుందని తెలంగాణలోని వైఎస్ అభిమానులు చెబుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-