వైఎస్ఆర్ భీమాతో పేద‌ల‌కు భ‌రోసా…

వైఎస్ఆర్ భీమా ప‌థ‌కాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాల‌యంలో వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.  రాష్ట్రంలో కుటుంబ‌పెద్దను కోల్పోయిన వారికి అండ‌గా ఉండేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. 2021-22 సంవ‌త్సరానికి రూ.750 కోట్ల రూపాయ‌ల‌తో భీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్టు వైఎస్ పేర్కొన్నారు.  పేద‌ల‌పై ఎలాంటి భారం ప‌డ‌కుండా భీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు.  బ్యాంకుల‌తో సంబంధం లేకుండానే ఈ ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నామ‌ని తెలిపారు.  కుటుంబ పెద్ద చ‌నిపోతే, ఆ కుటుంబానికి భీమాతో భ‌రోసా క‌ల్పిస్తుంద‌ని అన్నారు.

Read: ప్రీ లుక్ తో ‘రవితేజ 68’ అప్డేట్…!

 వైఎస్ఆర్ భీమా ప‌రిధిలోకి 1.30 ల‌క్ష‌ల కుటుంబాలు వ‌చ్చాయ‌ని జ‌గ‌న్ తెలిపారు.  ఇక 18-50 ఏళ్ల‌లోపు వ్య‌క్తులు స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే ల‌క్ష‌రూపాయ‌ల ప‌రిహారం ఉంటుంద‌ని, 18 నుంచి 70 ఏళ్ల లోపున్న వ్య‌క్తులు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం అందుతుంద‌ని అన్నారు.  రెండేళ్ల‌లో వైఎస్ఆర్ భీమా కోసం రూ.1307 కోట్ల రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.  2020 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ఈ ప‌థ‌కం నుంచి త‌ప్పుకుంద‌ని, కేంద్రం ప‌క్కకు త‌ప్పుకున్నా, రాష్ట్ర‌ప్ర‌భుత్వ‌మే అంతా భ‌రిస్తుంద‌ని అన్నారు. 

Related Articles

Latest Articles

-Advertisement-