రేపు వైఎస్సార్ 12వ వర్ధంతి : ఇడుపుల పాయకు వైఎస్ షర్మిల

రేపు వైఎస్సార్ 12వ వర్ధంతి ఉన్న నేపథ్యం లో ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే… లోటస్ పాండ్ నుంచి ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్ షర్మిల. ఇక రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ దగ్గర విజయమ్మ తో కలిసి నివాళులు అర్పించనున్నారు వైఎస్‌ షర్మిల. ఇక ఆ కార్యక్రమం అయ్యాక… రేపు మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు షర్మిల. రేపు పార్టీ కార్యాలయం లో భారీ ఎత్తున జాబ్ మేళా, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసింది వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం… సాయంత్రం వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న సంస్మరణ సభ కు హాజరు కానున్నారు షర్మిల.

Related Articles

Latest Articles

-Advertisement-