నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల సంచలనం !

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మరోసారి వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఓ హంతకుడంటూ ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడండంటూ ఫైర్‌ అయ్యారు. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదంటూ ఓ రేంజ్‌ లో సీఎం కేసీఆర్‌ పై రెచ్చిపోయారు వైఎస్‌ షర్మిల. చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారా సీఎం గారూ అంటూ చురకలు అంటించారు.

”మీకు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాలు మీద లేదు. నిన్న మహేష్, ఈ రోజు లవన్ కుమార్, శ్రీకృష్ణ.. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు మీరు.మరొక్క నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయండి. లేదంటే రాజీనామా చేయండి.” అంటూ ఫైర్‌ అయ్యారు.

Related Articles

Latest Articles