రేపు రంగారెడ్డి జిల్లాలో వైఎస్ ష‌ర్మిల ప‌ర్య‌ట‌నః రైతుల‌తో చ‌ర్చ‌లు…

రేపు సంగారెడ్డి జిల్లాలో వైఎస్ ష‌ర్మిల ప‌ర్య‌టించ‌నున్నారు.  రంగారెడ్డి జిల్లాలోని ఐకెపి సెంట‌ర్ల‌లో ఉన్న ధాన్యంను ప‌రిశీలించ‌నున్నారు.  ఆ త‌రువాత అక్క‌డున్న రైతుల స‌మ‌స్య‌ల గురించి అడిగి తెలుకుంటారు.  తెలంగాణ‌లో సొంతంగా పార్టీని ఏర్పాటు చేయ‌బోతున్న ష‌ర్మిల, పార్టీకి సంబందించిన జెండా, అజెండాను జులై 8 వ తేదీన ప్ర‌క‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.  ఈలోగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ఆ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు వైఎస్ ష‌ర్మిల సిద్దం అవుతున్నారు.  ఇందులో భాగంగానే ఇప్ప‌టికే ష‌ర్మిల కొన్ని చేవేళ్ల ప్రాంతంలో ప‌ర్య‌టించారు.  రేపు రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  ఏపీలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండగా పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వాటిని నెర‌వేరుస్తున్నారు.  అదే విధంగా ష‌ర్మిల కూడా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొవ‌డానికి తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తారా చూడాలి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-