సిఎం కెసిఆర్ సొంత జిల్లాలో షర్మిల పర్యటన !

తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా రేపు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. ఉదయం 6 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిల..మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎల్దుర్తి మండలంలోని అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉద్యోగం రావట్లేదని ఇటీవల మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ కొప్పు రాజు, మురళీ ముదిరాజ్ కుటుంబాలను పరామర్శించనున్నారు షర్మిల. అనంతరం గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. మెదక్ జిల్లా సిఎం కెసిఆర్ సొంత జిల్లా కావడం గమనార్హం. కాగా వైఎస్ ఆర్ పుట్టిన తేదీ జులై 8 న పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-