తొలిసారి మీడియా ముందుకు వైఎస్‌ షర్మిల..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల.. తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు.. పార్టీ జెండా, పేరు, అజెండా ప్రకటించిన తర్వాత ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. రేపు లొటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడనున్నారు షర్మిల.. రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పరిశీలకులను కూడా ప్రకటించనున్నారు.. మెంబర్ షిప్ డ్రైవ్, అక్టోబర్ లో పాదయాత్ర పై ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి.. పలు అంశాలపై స్పందిస్తున్న షర్మిల… ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వస్తున్నారు.. ధర్నాలు, దీక్షలకు కూడా దిగారు.. ఇక, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత.. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టిసారించారు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైఎస్‌ షర్మిల.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-