వైఎస్ఆర్‌టీపీ అధికార ప్ర‌తినిధుల నియామ‌కం.. వీరికి చోటు..

తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటు దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ ష‌ర్మిల‌… ఇప్ప‌టికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో.. త‌న అనుచ‌రుడితో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో రిజిస్ట్ర‌ర్ చేయించారు.. అభ్యంత‌రాలు ఉంటే తెల‌పాలంటూ ఓ ప్ర‌క‌ట‌న కూడా చేశారు.. మ‌రోవైపు పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు.. తాజాగా, వైఎస్ ష‌ర్మిల ఆదేశానుసారం.. అడ్ హక్ అధికార ప్రతినిధులను నియ‌మించిన‌ట్టు ఆమె కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఆ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం వైఎస్ఆర్‌టీపీ అధికార ప్ర‌తినిధులుగా.. కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్‌ను నియ‌మించిన‌ట్టు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది వైఎస్ ష‌ర్మిల కార్యాల‌యం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-