సింగరేణి కాలనీకి విజయమ్మ.. షర్మిలతో పాటు దీక్ష..

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి ఘటన అందరినీ కలచివేస్తోంది.. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి, ధైర్యాన్ని చెప్పగా… ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అక్కడే దీక్షకు దిగారు.. అయితే, రాత్రికి సింగరేణి కాలనీకి చేరుకున్నారు వైఎస్‌ షర్మిల.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. షర్మిలతోపాటు దీక్షలో కూర్చున్నారు. కాగా, ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్షలో కూర్చుంటానన్నారు.. నిందితుడికి ఉరిశిక్ష వేయిస్తారా..? ఎన్ కౌంటర్ చేస్తారా..? ఏదైనా వెంటనే చేయాలి. మీ ఇంట్లో కుక్క పిల్లలు చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్నారు. మరి.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు పోతే నీలో చలనం లేదు. నీకు మానవత్వం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ షర్మిల. ఇప్పుడు విజయమ్మ కూడా ఆమెతోపాటు దీక్షకు కూర్చోవడంతో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. కాగా, నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. మరోవైపు.. నిందితుడి వేటను ముమ్మరం చేశారు పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అలెర్ట్ చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-