జల జగడం.. వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల… హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.. నదీ జలాల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. కృష్ణా నది మీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అంటూ ఫైర్ అయ్యారు.. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు.. కలిసి భోజనాలు చేయొచ్చు.. స్వీట్లు తినినిపించుకోవచ్చు… కానీ, రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా? అని ప్రశ్నించారు.. ఇక, కేంద్రంలో అధికారంలో బీజేపీ, బోర్డులతో కలిసి ఎందుకు సమస్య పరిష్కారం చూపడం లేదన్న ఆమె.. అసలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి ఉందా? అని నిలదీశారు.. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలేనంటూ కామెంట్ చేసిన షర్మిల.. వైఎస్సార్ టిపి వైఖరి…. గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టులోనైనా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని వదులు కోసం… ఇతర ప్రాంతాలకు చెందిన ఒక్క చుక్కా మాకు వద్దు అని స్పష్టం చేశారు.

సమన్యాయం జరగాలని వైఎస్సార్ టిపి కోరుకుంటుందన్నారు వైఎస్‌ షర్మిల.. ఇక, తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ పేరు ఉచ్చరించే అర్హత లేదన్న ఆమె.. వైఎస్సార్ అసలైన వారసులం మేమే. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసులం మేమే అన్నారు.. మరోవైపు.. బీజేపీ దగ్గర కేసీఆర్ కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు షర్మిల.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఏదైనా లోపాయకారి ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. ఇక, వైఎస్సార్ గురించి తప్పుగా మాట్లాడితే లక్షల్లో ఉన్న వైఎస్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారని హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-