సిద్ధార్థ్ చనిపోయాడంటూ థంబ్ నెయిల్!

కొందరు వ్యక్తులు తెలిసీ తెలియక చేస్తున్న పనులు హీరో సిద్ధార్థ్ కు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. చిత్రం ఏమంటే ఆ విషయాన్ని స్వయంగా సిద్ధార్థే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడు. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు సంబంధించిన థంబ్ నెయిల్ సిద్ధార్థ్ ను షాక్ కు గురిచేసింది. ‘యుక్తవయసులో చనిపోయిన 10 మంది దక్షిణాది ప్రముఖ తారలు’ అంటూ ఓ వీడియోను ఒక యూ ట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. దాని థంబ్ నెయిల్ లో సౌందర్య, ఆర్తి అగర్వాల్ మధ్యలో సిద్ధార్థ్ ఫోటోను పెట్టారు.

Read Also: సూర్య సినిమా సంగీత దర్శకుడి కన్నుమూత

ఇది తన దృష్టికి రాగానే సిద్ధార్థ్ సదరు యూ ట్యూబ్ ఛానెల్ వారికి ఫిర్యాదు కూడా చేశాడట. ‘సారీ… ఆ వీడియోలో ఏం తప్పులేదు కదా!’ అంటూ వాళ్ళు బదులిచ్చారట. నిజంగానే ఆ వీడియోలో సిద్ధార్థ్ మరణించాడంటూ ఎలాంటి సమాచారం లేదు. కానీ సమస్య అంతా ఆ వీడియోకు పెట్టిన థంబ్ నెయిల్ తోనే! దానిని మార్చుతామనే మాట ఎత్తకుండా వాళ్ళ ఇలా బదులివ్వడం సిద్ధార్థ్ కు చికాకు తెప్పించినట్టుగా ఉంది. కొందరి మెంటాలిటీ ఇలా ఉందంటూ ఆ థంబ్ నెయిల్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చిత్రం ఏమంటే… మూడేళ్ళ క్రితం పోస్ట్ అయిన ఆ వీడియో థంబ్ నెయిల్ ను ఇప్పటికీ వాళ్ళు మార్చనే లేదు!

సిద్ధార్థ్ చనిపోయాడంటూ థంబ్ నెయిల్!
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-