ప్రహరీ గోడను ఢీకొని.. తిరిగి రాని లోకాలకు

చిన్నపాటి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం యువత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద జరిగిన ఘటన ఇది. గొల్లపల్లి గ్రామానికి అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీకొన్న నవీన్ అనే యువకుడు మరణించాడు.

మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొన్నాడు యువకుడు. నవీన్ మృతి చెందాడని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మలుపు వద్ద ఎలాంటి సూచిక బోర్డు, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మృతుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పోచ్చెట్టిగుడా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Related Articles

Latest Articles