చెరువులో యువతి మృతదేహం.. లైంగిక దాడి చేసినట్లు అనుమానం

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శామీర్‌పేట మండలం పొన్నాల చెరువులో ఆదివారం ఉదయం ఓ యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ఆ యువతి చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి యువతిని హత్య చేసి ఉంటారని.. అనంతరం బాడీని చెరువులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు ఘటనా స్థలానికి వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read Also: ముగిసిన మిస్టర్ ఇండియా పోటీలు.. విజేత ఎవరంటే..?

Related Articles

Latest Articles