గుండెపోటుతో భారత యువ క్రికెటర్ మృతి…

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బ‌రోట్ ఈరోజు గుండె పోటుతో మ‌ర‌ణించాడు. అతడికి తల్లి, భార్య ఉన్నారు. అవి బ‌రోట్ మ‌ర‌ణ వార్త‌ను సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీఏ) ఈరోజు అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే 29 ఏళ్ల అవి బ‌రోట్ మ‌ర‌ణంపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా మాట్లాడుతూ… అవి బ‌రోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ లోపలే తుది శ్వాస విడిచాడు. అతనికి ఎంతో ప్రతిభఉంది. అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా’ అని అన్నారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 122 పరుగులు చేసి అందరిని ఆకర్షించారు. ఇక 29 ఏళ్ల అవి బ‌రోట్ 2011లో అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అలాగే 2019-20 సీజన్‌ లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అవి బ‌రోట్ సభ్యుడు. తన కెరియర్ లో 38 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 38 లిస్ట్‌-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచులు ఆడాడు. అయితే ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్‌-ఏ మ్యాచ్‌లలో 1030 రన్స్ , టీ20లలో 717 పరుగులు చేశాడు.

Related Articles

Latest Articles