వీడియో: జూపార్కులో యువకుడి అత్యుత్సాహం

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం రోజు ఓ యువకుడు హద్దు మీరి ప్రవర్తించాడు. సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఎన్‌క్లోజర్ పై నుంచి సింహం బోనులోకి దూకేందుకు యువకుడు యత్నించగా… జూపార్క్ సిబ్బంది అతడిని గమనించారు.

దీంతో యువకుడు సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకకుండా సిబ్బంది నిలువరించారు. అయితే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడి కోసం సింహం ఆశగా ఎదురుచూసిందని.. యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిందని జూపార్క్ సిబ్బంది వెల్లడించారు. ఒకవేళ తాము వెంటనే అప్రమత్తం కాకపోతే యువకుడిపై సింహం దాడి చేసేదని వారు వాపోయారు.

కాగా సదరు వ్యక్తిని ఎర్రగడ్డకు చెందిన సాయికుమార్‌గా పార్క్‌ సిబ్బంది గుర్తించారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అతడి మాటల ద్వారా అర్థమైందని వారు తెలిపారు. సింహాల దగ్గర రత్నాలు ఉంటాయని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పారు. దీంతో యువకుడిని బహదూర్ పురా పొలీసులకు అప్పగించారు.

Related Articles

Latest Articles