రైలుకు ఎదురుగా నిలబడి యువకుడి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం జరిగింది. రైలుకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిశాకు చెందిన వలస కూలీ సంజయ్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలస కూలీ సంజయ్ కుమార్.. అందరూ చూస్తుండగా ఒక్కసారి ట్రాక్ మీదకు వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మృతుడి మానసిక స్థితి బాగోలేదని రైల్వే పోలీసులు వెల్లడించారు.

Related Articles

Latest Articles