ప్రేయసి ఇంట్లో ప్రేమోన్మాది.. ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే..?

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని కూడా హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్, గోండా ప్రాంతానికి చెందిన స్వప్న గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అంతేకాకుండా స్వప్నకు మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. ఇక దీంతో ప్రియుడు అశోక్ కోపంతో రగిలిపోయాడు.

తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని ప్రియురాలిని హతమార్చడానికి ప్లాన్ వేశాడు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై స్వప్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ నిద్రపోతున్న స్వప్న తల్లిదండ్రులను కత్తితో నరికేశాడు.. అనంతరం స్వప్న అతని చెల్లి ఉపాసనపై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా.. ఉపాసన మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related Articles

Latest Articles