అత్తతో అల్లుడి రాసలీలలు.. స్కూల్ వెనుకకు తీసుకెళ్లి

వివాహేతర సంబంధం.. ప్రస్తుతం ఎన్నో క్రైమ్స్ కి కారణం అవుతుంది.. పరాయి వారి మీద మోజు ఎంతవరకైనా తీసుకెళ్తోంది. ఇక వారు కనుక దూరం పెడితే ఆ కోపం ఎంతటి దారుణానికి ఒడిగడ్డడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా ఒక వ్యక్తి వివాహేతర సంబంధం అతనిని జైలు పాలు చేసింది. పరాయి మహిళ మోజు అతినిని చిప్పకూడు తినేలా చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా హాల్కురుకు చెందిన రాజేశ్, భారతి(30) కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఎంతో అన్యోన్య దంపతులు.. సజావుగా సాగుతున్న వీరి కాపురంలోకి దివాకర్ అనే వ్యక్తి ఎంటరయ్యాడు. రాజేశ్ అక్క కొడుకు కావడంతో భారతి, మేనల్లుడు దివాకర్ తో చనువుగా మెలగడం మొదలుపెట్టింది. ఆ చనువు కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. మామ ఇంట్లో లేని సమయంలో అత్తాఅల్లుడు కామక్రీడలో మునిగితేలేవారు. కొద్దిరోజులకు వీరి వ్యవహారం బంధువులతో పాటు భర్తకు కూడా తెలిసింది. దీంతో భర్త ఇద్దరిని మందలించి వదిలేశాడు. అప్పటినుంచి భారతి, దివాకర్ ని దూరం పెట్టసాగింది.

అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తోన్న భారతి మాట్లాడకపోయేసరికి దివాకర్ కి పిచ్చెక్కిపోయింది. ఆమె పనిచేస్తున్న స్కూల్ వద్దకు వెళ్లి మాట్లాడాలని పిలిచి స్కూల్ వెనకకు తీసుకొచ్చాడు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. భారతి కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి వెళ్లి చూడగా దివాకర్ పారిపోతూ కనిపించగా.. రక్తపు మడుగులో భారతి కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివాకర్ ని అరెస్ట్ చేశారు.

Related Articles

Latest Articles