ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో బలైన యువకుడు…

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఓ యువకుడు బలయ్యాడు. యాక్సిడెంట్ లో మతిస్థిమితం కోల్పోయిన యువకుడిని మూడు రోజులపాటు గదిలో పడేసారు సిబ్బంది. అక్కడ ట్రీట్మెంట్ లేక తాగడానికి నీళ్లు లేక ప్రాణాలు కోల్పోయాడు పులి కిరణ్. గత బుధవారం వరదయ్యపాలెం వద్ద ద్విచక్ర వాహనంలో వేళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పులి కిరణ్… వైద్యం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా అస్పత్రికి తరలించారు వరదయ్యపాలెం పోలీసులు. ప్రమాదం తర్వాత మతి తప్పిన యువకుడు ఆస్పత్రి‌ వద్ద గందరగోళం చేస్తున్నాడని గదిలో మూడు రోజుల పాటు నిర్బంధించారు ఆసుపత్రి సిబ్బంది. సోమవారం కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు ఆధికారులు.

అయితే వైద్యల నిర్లక్ష్యం కారణంగానే మృతి చేందాడని కుంటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆకలితోనే తన తమ్ముడు మృతి చెండాడని అవేదన వ్యక్తం చేసిన మృతుడి అక్క.. మతిస్థిమితం లేకపోతే వైద్యం నిమిత్తం తిరుపతి రూయాకు ఎందుకు తరలించలేదని సూపర్డెంట్ ను ప్రశ్నించారు కుటుంబ సభ్యులు. అతని వివరాలను పోలిసులు అందించలేదని బదులు ఇచ్చారు అస్పతి సూపర్డెంట్. పులి కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించేంతవరకు మృతదేహాన్ని తీసుకు వెళ్ళమని ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు దళిత సంఘాలు నిరసనకు దిగ్గారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-