సెలవు ఇవ్వలేదని ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..?

ప్రస్తుతం యువత చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ప్రేమించినమ్మాయి కాదన్నందని, గేమ్ లో ఓడిపోయానని, తల్లిదండ్రులు తిట్టారని ఇలా చిన్నపాటి కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ఆఫీస్ లో సెలవు ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘటకేశ్వర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. కార్వాన్‌లో ఉండే సూర్యవంశీ అనిల్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్‌లోని కొరియర్ కార్యాలయంలో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడికి ఇటీవల ఏదో వ్యక్తిగత పని పడడం వలన కార్యాలయంలో సెలవు అడిగాడు. దానికి పై అధికారులు సెలవు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సహోద్యోగుల వేధింపులు ఎక్కువ కావడంతో శుక్రవారం అర్థరాత్రి ఘట్‌కేసర్ సమీపంలోని వరంగల్ హైవే పక్కన ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు కొద్దిదూరంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆఫీస్ లో సెలవు ఇవ్వకపోవడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles