సొంత పిన్ని శృంగార లీలలు చూసిన యువకుడు.. వీడియో తీసి అలా

వివాహేతర సంబంధాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మనకెంతో ఇష్టమైన వారు చిన్న తప్పు చేస్తేనే భరించలేము.. అలాంటిది వారు మరొక వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే.. ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ కోపంతోనే వారిని చంపడంతో లేక తమకు తాము చనిపోవడంతో చేస్తూ ఉంటారు. తాజాగా తనను తల్లిలా సాకిన పిన్ని వేరొక వ్యక్తితో శృంగార లీలలు చేస్తూ కనిపించేసరికి ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు.. ఆ బాధను దిగమింగుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. అజ్మీర్ జిల్లాలోని కబ్రా గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. వారి ఇంటి పక్కనే విశాల్ పిన్ని నివసిస్తోంది. తల్లి తరువాత తల్లిలా విశాల్, ఎప్పుడు పిన్నితోనే ఉంటాడు.. అయితే ఈ బుధవారం విశాల్ పిన్ని ఇంటికి వెళ్లగా.. అక్కడ ఆమె, గోవింద్ అనే వ్యక్తితో శృంగార లీలలు చేస్తూ కనిపించింది. పిన్నిని నగ్నంగా వేరొక వ్యక్తితో చూసిన అతడు తట్టుకోలేక పోయాడు. వెంటనే సెల్ఫీ వీడియో తీసుకొని ఆ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలో పిన్ని వేరొకతనితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అది చూసి తట్టుకోలేకే తానూ బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు చెప్పాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, వారి సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని వారే తమ బిడ్డను హత్య చేశారని విశాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles