రాజ్ త‌రుణ్ జీవితంలోకి కొత్త ఇల్లు…. న‌వ వ‌ధువు!

యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ దాంప‌త్య జీవితంలోకి త్వ‌ర‌లో అడుగుపెట్టే ఛాన్స్ క‌నిపిస్తోంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. లాక్ డౌన్ టైమ్ లో రాజ్ త‌రుణ్ న‌టించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ మొద‌ట ఓటీటీలోనూ, ఆ త‌ర్వాత ఈ యేడాది జ‌న‌వ‌రిలో థియేట‌ర్ల‌లోనూ విడుద‌లైంది. అలానే ఇటీవ‌ల అత‌ను నటించిన ప‌వ‌ర్ ప్లే మూవీ సైతం రిలీజ్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో స్టాండ‌ప్ రాహుల్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే… రాజ్ త‌రుణ్ ఇటీవ‌లే హైద‌రాబాద్ లో సొంత ఇల్లు క‌ట్టుకుని అందులోకి త‌ల్లిదండ్రుల‌తో పాటు మారాడు. కొత్త ఇల్లు ఏర్ప‌డిన వేళావిశేషం కావ‌చ్చు…. ఇత‌గాడికి సంబంధాలు చూసి, పెళ్ళి చేయాల‌ని పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. దాంతో అతని కోసం న‌వ వ‌ధువును వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌. వ‌చ్చే యేడాదిలో రాజ్ త‌రుణ్ పెళ్ళి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలోనూ రాజ్ తరుణ్ త్వ‌ర‌లో తానో ఇంటివాడిని కాబోతున్నానని చెప్ప‌డంతో ఈ వార్త‌ల‌కు సాధికారిక‌త ఏర్ప‌డింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-