ఛీఛీ ఈమె అసలు తల్లేనా.. ప్రియుడి మోజులో పడి కన్నకూతురిని అర్ధరాత్రి అలా చేసి

వివాహేతర సంబంధాలు.. బంగారంలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయి వారి మోజులో కన్నవారిని, కట్టుకున్నవారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తల్లి వివాహేతర సంబంధం .. కూతురు చాకు కారణమైంది. వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లా, లింగసముద్రంకు చెందిన మాధవికి తమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. భర్త వదిలివెళ్లిపోవడంతో కూతురితో కలిసి నివాసముంటోంది. కూతురు ప్రశాంతి పదోతరగతిలో మంచి ర్యాంక్ సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించుకొంది. వచ్చే సోమవారం ఆమె అందులో జాయిన్ కావాల్సి ఉండగా అనుమానాస్పద రీతిలో ఆమె మృతిచెందడం, ఎవరికి చెప్పకుండా తల్లి, కూతురు శవాన్ని దహనం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కన్నతల్లి ఎఫైరే ఆమె చావుకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.

మాధవి భర్తతో విడిపోయాక.. ఆమె ఇంటి కింద పోర్షన్లో ఉంటున్న యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విష్యం కూతురుకు తెలియడంతో ఆమె కూతురిని హత్య చేసి ఉంటుందని, దానికి ప్రియుడు కూడా హెల్ప్ చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో తల్లి మాధవి, ప్రియుడిపై అనుమానం వచ్చింది. కూతురు ఎలా చనిపోయింది అంటే.. ఒకసారి మెట్లపై జారీ పడిందని, ఇంకోసారి గుండెపోటు తో అని ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. అంతేకాకుండా ఒక రోజంతా కూతురు శవాన్ని ఇంట్లో ఉంచి అర్ధరాత్రి అడవిలోకి తీసుకెళ్లి దహనం చేయాల్సిన అవసరం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles