ప్రతి చోటా మార్పు కోరుకుంటున్న యువతరం…

ఈరోజు జరిగిన తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసొసియేషన్ ఎన్నికలలో ఉన్న 489 సభ్యులలో 389 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకునే పద్దతికి స్వస్తీ చెప్తూ.. ఈసారి ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడూ అసొసియేషన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోని సభ్యులు కూడా ఈసారి ఎన్నికలలో యాక్టివ్ గా పాలుపంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన యువ సినిమాటోగ్రఫర్ P.G. విందా అధిక మెజారిటీ తో సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ అయిన హరి అనుమోలు మరియు టీ. సురేంద్ర రెడ్డి ల పై విజయం సాధించారు. ఇక సెక్రటరీ గా బి.వాసు, ట్రెజరర్ గా భీముడు అలియస్ శ్రీకాంత్ విజయం సాధించారు. అలాగే అసొసియేషన్ సభ్యులందరు ఇక మీదటా అయినా తమకి ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనే ఆశాభావంతో ఉన్నారు.

-Advertisement-ప్రతి చోటా మార్పు కోరుకుంటున్న యువతరం…

Related Articles

Latest Articles