ఉద‌యం పెళ్లి చేసుకొని… రాత్రికి ప్రియుడితో పారిపోవాల‌నుకుంది…కానీ…

రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి మూడేళ్లుగా ఓ యువ‌కుడిని ప్రేమించింది.  కానీ, ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌కుండా దాచిపెట్టి పెళ్లికి సిద్ద‌మ‌యింది.   ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సిద్దమైన‌పుడు కూడా ఎవ‌రికి చెప్ప‌లేదు.  పెళ్లి స‌మ‌యంలో ఆ యువ‌తి ప్రేమించిన యువకుడితో చాటింగ్ చేసింది.  పెళ్లిపీట‌ల‌మీద నుంచి కూడా యువ‌తి చాటింగ్ చేయ‌డంతో అనుమానం వ‌చ్చిన బంధువులు యువ‌తి మొబైల్‌ఫోన్‌ను, పెళ్లి పందిరిలో అనుమానంగా క‌నిపించిన యువకుడిని ప‌ట్టుకున్నారు.  యువ‌కుడికి దేహ‌శుద్ధి చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  యువ‌కుడి మొబైల్‌లో పెళ్లికూతురితో క‌లిసి తిరిగిన ఫొటోలను చూసి బంధువులు షాక్ అయ్యారు.  ఈ వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్‌కు చేరుకోవ‌డంతో ప్రేమ విష‌యాన్ని యువ‌తీ యువ‌కులు ఒప్పుకున్నారు.  అయితే,  ఎవ‌రూ కూడా రాత పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డంతో పెళ్లికొడుకును, పెళ్లికూతురిని ఎవ‌రింటికి వారిని పంపించేశారు.  అటు ప్రేమించిన యువ‌కుడిని కూడా వ‌దిలిపెట్టారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-