లైఫ్ టైం మెమొరీస్… నాగ చైతన్య పోస్ట్

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ‘లవ్ స్టోరీ ‘ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది.

ఈ సినిమా ఓవర్శిస్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత్య భారీ వసూలులో రాబట్టిన చిత్రంగా ‘లవ్ స్టోరీ’ నిలిచింది. ఈ రోజు ఉదయం నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లవ్ స్టోరీ’ టీమ్‌ తో కలిసి ఉన్న సంతోషకరమైన ఫోటోను షేర్ చేశారు. “టీమ్ లవ్ స్టోరీకి ధన్యవాదాలు. మీరు నాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చారు” అంటూ ట్వీట్ చేశారు.

Read Also : ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?

మరోపక్క విక్రమ్ కుమార్ హర్రర్ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తేలకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు చై. అంతేకాదు ‘బంగార్రాజు’లో తండ్రితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘థాంక్యూ’ విడుదలకు సిద్ధమవుతోంది.

-Advertisement-లైఫ్ టైం మెమొరీస్… నాగ చైతన్య పోస్ట్

Related Articles

Latest Articles