కరోనా దెబ్బ: ప్రధాని పదవికి ఎసరు

కరోనా ఎంత పనిచేస్తివి.. అందరినీ అసహాయులను చేస్తుంటివి.. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ లో అయితే ఉద్యోగాలు పోయి చాలా మంది తినడానికి తిండిలేని పరిస్థితులు చవిచూశారు. ఇది సామాన్యులకే కాదు.. దేశాన్ని పాలించే ప్రభువులకు కూడా చుట్టుకుందన్న విషయం తాజాగా తేటతెల్లమైంది. కరోనా ధాటికి ఓ బిగ్ వికెట్ పడిపోయింది.

చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. చైనా తన వస్తువులను కారుచౌకగా ఎగుమతి చేసినంత ఈజీగా కరోనా వైరస్ ను కూడా అన్నిదేశాలకు సరఫరా చేసింది. ఈ మహమ్మరి కారణంగా కోట్లాది మంది అయామక ప్రజలు ప్రాణాలు కోల్పోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిన సంగతి తెల్సిందే. కరోనా వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తూ కొత్త కొత్త వేరియంట్లతో మనుషులపై దాడి చేస్తుండటం ఆందోళన రేపుతోంది. కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్ అంటూ అన్నిదేశాల్లో కొత్తకొత్త పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సామాన్య ప్రజల బాధలు ఈ కరోనా కాలంలో వర్ణనాతీతంగా మారాయి.

కరోనా కట్టడిలో అగ్రరాజ్యాలు సైతం చేతులేత్తిన సంఘటనలున్నాయి. అమెరికా, బ్రిటన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సైతం కరోనాను కట్టడి చేయలేకపోయాయి. కరోనా ఎంట్రీ ఇచ్చిన ఏడాది తర్వాత వ్యాక్సిన్ రావడంతో పరిస్థితులు ఇప్పుడు కొంత కంట్రోల్లోకి వచ్చినట్లు కన్పిస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో కరోనా భయం ఏమాత్రం పోవడం లేదు. కరోనా ఎఫెక్ట్ తో జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగ తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వైరస్ కట్టడిలో తాను విఫలం అయినందుకు బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోబోతోన్నట్లు సుగ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు ఈ నెల చివరివారంలో జరిగే అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

గతేడాది క్రితమే యోషిహిడె సుగ జపాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన కంటే ముందు పని చేసిన షింజో అబే అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో సుగను ప్రధాన మంత్రి ఎన్నికయ్యారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో యోషిహిడె సుగ విఫలమయ్యారు. ఫలితంగా ఆయన అప్రూవల్ రేటింగ్‌ పడిపోయింది. దీంతో ఆయన తన పదవీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రధాని పదవి రేసులో పరిగెత్తడానికి.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి చాలా శక్తి అవసరం అవుతుందని చెప్పారు. అంతటి శక్తి తనకు లేదని పరోక్షంగా సుగ అంగీకరించారు. అయితే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా నియంత్రణకు, ఇతర సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేశానని చెప్పుకొచ్చారు.

తన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లడానికి, కరోనా మహమ్మారిని నియంత్రించడానికి చాలా శక్తి సామర్థ్యాలు అవసరవుతాయని తెలిపారు. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటందని.. ఆమేరకు తన పదవిని త్యజించేందుకు సిద్ధమైనట్లు యోషిహిడె సుగ చెప్పారు. దీంతో ఆయన స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జపాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఫ్యుమియో కిషిదా, సనాయి టకాయిచి, షిగెరు ఇషిబా పేర్లు ప్రధాని రేసులో విన్పిస్తున్నాయి. అక్టోబర్‌ మొదటి వారం లేదంటే రెండో వారంలో జపాన్ కొత్త ప్రధాని ఎంపిక పూర్తి కావచ్చని సమాచారం అందుతోంది.

Japan's New Prime Minister Suga signals continuity - The Sunday Guardian  Live

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-