ఆస్కార్ ఇండియన్ ఎంట్రీ షార్ట్ లిస్ట్ లో యోగిబాబు ‘మండేలా’!

ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు ఇప్పుడిప్పుడే కథానాయకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. ఈ యేడాది ఏప్రిల్ లో అతను ప్రధాన పాత్ర పోషించిన ‘మండేలా’ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు వీక్షకుల అభినందనలూ అందుకున్న ‘మండేలా’కు మరో గౌరవం దక్కింది. ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ ఛైర్మన్ గా ఉన్న ఆస్కార్ ఇండియన్ మూవీస్ సెలక్షన్ కమిటీ ఇటీవల దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 14 సినిమాలను ఎంపిక చేసింది. అందులో యోగిబాబు నటించిన తమిళచిత్రం ‘మండేలా’ సైతం ఉండటం విశేషం. అలానే మలయాళ చిత్రం ‘నయట్టు’ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది.

Read Also : షూటింగ్ లో కాల్పులు… సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!

ఇక హిందీ చిత్రాలు ‘షేర్నీ’, సర్దార్ ఉద్దమ్’ కూ చోటు దక్కిందని తెలుస్తోంది. ఈ 14 చిత్రాలలో ఒక దానిని 2022 మార్చి 24న జరిగే ఆస్కార్ పోటీలకు భారత్ దేశం తరఫు నుండి అధికారిక చిత్రంగా పంపుతారు. మరి ఆ ఛాన్స్ ఏ చిత్రానికి దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ‘మండేలా’ షార్ట్ లిస్ట్ లో ఉండటం పట్ల యోగిబాబు ట్విట్టర్ లో తన హర్షం వ్యక్తం చేశాడు. ఈ స్టార్ కమెడియన్ ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’, అజిత్ ‘వాలిమై’, దర్శకుడు హరి ‘యానై’, ‘తమిళరాసన్’ చిత్రాలతో పాటు షారుక్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న అట్లీ హిందీ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Related Articles

Latest Articles