నిన్న ‘మండేలా’… నేడు ‘వీరప్పన్’ అంటోన్న తమిళ కమెడియన్!

యోగి బాబు… కోలీవుడ్ లో ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు కూడా!

యోగి బాబు తాజాగా ‘మండేలా’ అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో ఆయనదే ప్రధాన పాత్ర. బాక్సాఫీస్ వద్ద తన స్వంత ఇమేజ్ తో సినిమా సక్సెస్ చేయగలనని ఆయన మరోసారి ఋజువు చేశాడు. అయితే, సక్సెస్ మాత్రమే కాదు యోగి బాబు నటనకి కూడా ‘మండేలా’ సినిమాకిగానూ బోలెడు పొగడ్తలు వస్తున్నాయి. తమిళ సినిమా సెలబ్రిటీలు చాలా మంది సొషల్ మీడియాలో యోగిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

తను ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలే కాక యోగి బాబు స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలకంగా మారాడు. ఆయన నెక్ట్స్ రిలీజెస్ లో అజిత్ ‘వలిమై’, విజయ్ ‘బీస్ట్’ లాంటి సినిమాలున్నాయి. ఇలా ఫుల్ బిజీగా ఉన్న యోగి మరో డిఫరెంట్ మూవీతో త్వరలోనే జనం ముందుకు రానున్నాడు. ‘వీరప్పనిన్ గజన’ టైటిల్ తో లెటెస్ట్ గా ఓ ఫస్ట్ లుక్ విడుదలైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కళైపులి ఎస్ థాను సొషల్ మీడియాలో దీన్ని రిలీజ్ చేశాడు. ‘వీరప్పనిన్ గజన’లోనూ యోగి బాబుదే ప్రధాన పాత్ర కావటంతో హాస్య ప్రియులు బాగానే ఆసక్తి చూపుతున్నారు. చూడాలి మరి, యశ్ దర్శకత్వంలో కొత్త నిర్మాత ప్రారబ్దీశ్ ప్రొడ్యూస్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి స్పందన స్వంతం చేసుకుంటుందో!

Related Articles

Latest Articles