యూపీ ఎన్నిక‌లు: యోగి వ‌ర్సెస్ ప్రియాంక గాంధీ…!!

వ‌చ్చే ఏడాది ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు అన్నిపార్టీలు స‌మాయాత్తం అవుతున్నాయి.  అమ్ముల‌పొదిలోని అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి.  యోగీ నేతృత్వంలోనే 2022 ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, కాంగ్రెస్ పార్టీ కొత్త త‌రం నేత‌ల‌తో దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యక్షంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని ప్రియాంకా గాంధీ మొద‌టిసారి యూపి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు.  ఆమెను యూపి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే ఆమె అభ్య‌ర్థిత్వం ఖ‌రారైన‌ట్టు స‌మాచారం.  వ‌చ్చే ఎన్నిక‌లు యోగీ వ‌ర్సెస్ ప్రియాంక గాంధీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.  అమేథి నుంచి రాహుల్ గాంధీ ఓటమిపాల‌య్యాక ఆ పార్టీ బ‌లం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.  ప్ర‌స్తుతం బీజేపీ కొంత ఎదురుగాలి వీస్తున్న‌ది.  బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తున్న‌ది.  ఇందులో భాగంగానే యూపీలో 12 వేల కిలోమీట‌ర్ల మేర కాంగ్రెస్ ప్ర‌తిజ్ఞ యాత్ర‌ను చేప‌ట్టాల‌ని పార్టీ చూస్తున్న‌ది. 

Read: భార‌త‌ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం: భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు కీల‌క ఆదేశాలు…

Related Articles

Latest Articles

-Advertisement-