వైఎస్‌ వివేకా కేసు: రంగయ్య ఆరోపణలపై స్పందించిన ఎర్ర గంగిరెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాస్త ముందడుగు పడింది.. ఈ కేసులో వాచ్‌మన్‌ రంగయ్య తన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు.. అయితే, రంగయ్య వ్యాఖ్యలపై స్పందించారు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి.. అసలు వాచ్ మెన్ రంగయ్యతో నాకు పరిచయమే లేదన్న ఆయన.. నేను ఎవరిని బెదిరించలేదన్నారు… కడప, పులివెందులలో బెదిరించినట్లు నాపై కేసులు కూడా ఎక్కడా లేవు? అలాంటి ది వాచ్ మెన్ రంగయ్యని ఎలా బెదిరిస్తానని ప్రశ్నించారు.. వివేకానంద రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ద్రోహం చేసిన వ్యక్తిని కాదని స్పష్టం చేసిన ఎర్ర గంగిరెడ్డి.. ఆయనహత్య కేసులో నా ప్రమేయం లేదన్నారు.. వివేకానంద రెడ్డి నన్ను బాగా చూసుకొనే వారు.. ఆయన హత్య విషయంలో నాకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-