‘రౌడీ బాయ్స్’కు ‘రాధేశ్యామ్’ హెల్ప్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న “రౌడీ బాయ్స్” సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా “రౌడీ బాయ్స్” నిర్మాతలు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను కలిసి ఈ సినిమా నుండి నెక్స్ట్ సాంగ్ ను లాంచ్ చేయమని కోరారు. “యే జిందగీ” అనే టైటిల్ తో వస్తున్న స్నేహబంధానికి సంబంధించిన సాంగ్ ను ప్రభాస్ లాంచ్ చేశారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ ఈ సాంగ్ బాగుందని, ఆశిష్ అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ కొత్త పాట ఈరోజు ఉదయం 11 గంటలకు యూట్యూబ్‌లో విడుదల కానుంది.

Read Also : 65 ఏళ్ళ ‘సతీ సావిత్రి’

“రౌడీ బాయ్స్‌”లో అనుపమ పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ మూడింటిని ఈరోజే విడుదల చేయనున్నారు. 11 గంటలకు, 2 గంటలకు, 5 గంటలకు వరుసగా సినిమాలో నుంచి పాటలను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు “రౌడీ బాయ్స్” మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

Image
Image
Image

Related Articles

Latest Articles