రేపు భారత్ బందు : మద్దతు తెలిపిన వైసీపీ

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు ఊతమివ్వడానికి సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 27 న భారత్ బంద్‌కు సిద్ధమవుతోంది. ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. ఏపీలో ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. 27న మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఏపీలో ఆర్టీసీ బస్సులు ఆపేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 27 న భారత్ బంద్ కు ఏఐసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ విజయవంతం చేయాలనీ… ప్రతి కార్యకర్త…అభిమాని పాల్గొనాలనీ పిలుపు నిచ్చాయి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ కమిటీలు. టీడీపీ కూడా భాగస్వామ్యం అవుతుంది.

-Advertisement-రేపు భారత్ బందు : మద్దతు తెలిపిన వైసీపీ

Related Articles

Latest Articles