ఇది దళితుల విజయం..ఇకనైనా చంద్రబాబు కళ్లు తెరవాలి: వైసీపీ

బద్వేల్‌ విజయం పై వైసీపీ నేత, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. భారీ మెజార్టీ అందించిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాంత్‌ రెడ్డి. ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని… ఇది దళితులు విజయం, ప్రతి సామాన్యుడి విజయమని పేర్కొన్నారు. సంప్రదాయాన్ని గౌరవించి పోటీ చేయనని చెప్పిన టీడీపీ దొంగ దారిన బీజేపీకి మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని ఫైర్‌ అయ్యారు.

బీజేపీకి డిపాజిట్ ఎందుకు గల్లంతు అయ్యిందో విశ్లేషించుకోవాలని… ఇప్పటికైనా రాష్ట్రానికి రావలసిన విభజన హామీలను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నెరవేర్చేందుకు ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుని ఊగిపోతుంటారని.. పవన్ కళ్యాణ్ అజెండా ఏంటో అర్థం కావటం లేదని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెళ్లి పరిశ్రమ నష్టాల్లో ఉందని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పి కొడతారని…ఇప్పటికైనా బురద చల్లటం చంద్రబాబు మానుకోవాలన్నారు.

Related Articles

Latest Articles