తాలిబాన్లను మించిపోతున్న వైసీపీ ఆగడాలు: అచ్చెన్నాయుడు

తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.. వైసీపీకీ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త సైదాపై వారి కార్యకర్తల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? అంటూ పోలీసులపై విమర్శనాస్త్రాలను సంధించారు. పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్‌ కార్పెట్‌ వేసి దాడులు చేయించడానికా అంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు.

వైసీపీ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్న పోలీసులు చోద్యం చూడట మేంటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వారి కార్యకర్తలతో దాడులు చేయించడం సరికాదని ఆయన చెప్పారు. దాడికి గురైన టీడీపీ కార్యకర్త సైదాకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సైదాపై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు తెలిపారు.

Related Articles

Latest Articles