ఏపీ సమస్యలపై అమిత్ షా తో వైసీపీ ఎంపీల‌ సమావేశం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోకసభ పక్ష నాయకుడు మిధున్ రెడ్డి సమావేశమ‌య్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం అందించాల్సిన తోడ్పాటు పై ఈ సంద‌ర్భంగా అమిత్ షా కు వివరించారు విజయసాయి రెడ్డి.
ఆయా అంశాలపై విపులంగా అమిత్ షా కు మెమోరాండాన్ని అందజేశారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదం తెలపాలని ఈ సంద‌ర్భంగా విన్న‌వించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే దిశగా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీలో ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన తీవ్ర నష్టాన్ని వివరించారు విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి వరద సహాయం చేయాలని ఈ సంద‌ర్భంగా కోరారు వైసీపీ ఎంపీలు.

Related Articles

Latest Articles