చంద్రబాబూ.. నిన్నెవరూ లవ్ చేయలేరు: విజయసాయిరెడ్డి

జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ. నిన్ను లవ్ చేసేది పచ్చ కుల మీడియా, నీ బినామీలే’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

Read Also: కరోనా ఎఫెక్ట్‌.. పవన్‌ కల్యాణ్ సమావేశం వాయిదా

కాగా వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలంటే పొత్తులు పెట్టుకోవడం అనివార్యమని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూసుకున్నా.. ప్రజా వినాశన పరిపాలన చూస్తున్నా.. విపక్షాలన్నీ కలిసి పోటీ చేయడం అవసరం అనిపిస్తోందని చంద్రబాబు తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తుపై మాట్లాడుతూ… ప్రేమ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలని.. వన్‌సైడ్ లవ్ చేయడం కరెక్ట్ కాదంటూ చంద్రబాబు ఛమత్కరించారు.

Related Articles

Latest Articles