వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి..

గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి చెందడంతో అధికార వైసీపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా మహ్మద్‌ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో విజయవాడ వైసీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఆమె విజయవాడ కార్పోరేషన్‌లోని 56వ డివిజన్‌కు కార్పోరేటర్‌గా కూడా పనిచేశారు.

Also Read : అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం..

అయితే నిన్నరాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరైన కరీమున్నిసా ఇలా మరణించడంతో వైసీపీ నేతలు వాపోయారు. ఆమె మృతిపట్ల వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తి చేశారు.

Related Articles

Latest Articles