వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతు పనులు…

ప్రస్తుతం ఏపీలో అధికార విపక్షాల మధ్య రోడ్లకు సంబంధించిన వివాదాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… రోడ్లపై తెదేపా నేతలు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5ఏళ్లలో 1356 కిమీ రోడ్లు వేశారు దీని ప్రకారం సగటున ఏటా 270కిలో మీటర్ల రోడ్డు మాత్రమే తెదేపా హయాంలో వేశారు. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 1883 కి.మీ తారు రోడ్లను నిర్మించారు. అంటే సగటున ఏడాదికి 942 కి,మీ రోడ్లను నిర్మించాం. ఇప్పుడు కొత్తగా 6500 కోట్లతో రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వర్షాలు తగ్గగానే ప్రభుత్వం రోడ్ల మరమ్మతు , కొత్తరోడ్ల నిర్మాణ పనులు చేపడుతుంది అని స్పష్టం చేసారు. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వల్ల రాష్ట్రంలో రోడ్లు దెబ్పతిన్నాయి. కరోనా వల్ల ప్రభుత్వ పనులన్నీ నిదానంగా జరుగుతున్నాయి. ఏడాది లోపు రాష్ట్రంలో రహదారులన్ని బాగుపడతాయి అని పేర్కొన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-