ఆ పథకంలో అన్నీ లోపాలే : వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన సంచలన వ్యాఖ్యలు !

వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేగా పథకాన్ని ఏపీలో సరిగా అమలు చేయలేకపోతున్నామని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిమెంట్ సరఫరా సరిగా లేదని తెలిపారు. బయట మార్కెట్‍లో సిమెంట్ ధరలు మండిపోతున్నాయని…. పరువుకు పోయి పనులు చేపట్టిన వారు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొన్నారు ధర్మాన. ప్రభుత్వ పనులు చేస్తున్న వారు నష్టపోతున్నారని… ఈ లోపాలను సరిచేసుకోవాలని కోరారు. మెప్పు కోసం తప్పుడు సలహాలు ప్రభుత్వ పెద్దలకు ఇవ్వొద్దని సూచనలు చేశారు ధర్మాన. అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని తెలిపారు.. ఇంకా ధర్మాన ప్రసాదరావు చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి…

Related Articles

Latest Articles