చంద్రబాబుకు అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా?: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స స్పష్టం చేశారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని బొత్స ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంస్కృతి టీడీపీ నేతలకే ఉందన్నారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు.

Read Also: ఏపీకి కేంద్రం కీలక ఆదేశాలు.. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక ఇవ్వాలి

చంద్రబాబు ఏడుపుపై స్పందించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము సహించబోమన్నారు. ఏపీలో మహిళలందరికీ సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బొత్స ఎద్దేవా చేశారు. ప్రజలపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. మరోవైపు ఏపీలో పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని… వరద మీద కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని బొత్స కితాబిచ్చారు.

Related Articles

Latest Articles