యష్ మంచి మనసు… ఆ 3000 మంది అకౌంట్లలోకి రూ.5000…!

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ జనజీవనంపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపై భారీగానే పడింది. దీంతో సినీ కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు బంద్ కావడంతో వారికి పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కేజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన 21 డిపార్టుమెంటులలో పనిచేసే 3000 మంది అకౌంట్లలోకి రూ.5000 ట్రాన్స్ఫర్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. “కంటికి కన్పించని కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది, చాలామందికి ఎంతో నష్టాన్ని కలిగించింది. నా సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ సినిమా పరిశ్రమ కూడా ఎంతగానో నష్టపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నా సంపాదనలో నుంచి సినిమా ఇండస్ట్రీకి చెందిన 21 డిపార్టుమెంటులలో పనిచేసే 3000 మంది అకౌంట్లలోకి రూ.5000 ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో కలిగిన నష్టానికి, బాధకు ఇది పరిష్కారం కాదని నాకు బాగా తెలుసు. కానీ ఇదొక ఆశాకిరణం…” అంటూ ట్వీట్ చేశారు. ఆయన మంచి మనసుకు ప్రశంసల వర్షం కురుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-