‘న‌ల్లంచు తెల్ల‌చీర‌’ నేయ‌బోతున్న యండ‌మూరి

ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్రనాథ్ రాసిన న‌ల్లంచు తెల్ల‌చీర‌ న‌వ‌ల‌ను గ‌తంలో చిరంజీవి హీరోగా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కె.య‌స్. రామారావు దొంగ‌మొగుడు పేరుతో సినిమాగా నిర్మించారు. అది సూప‌ర్ హిట్ అయ్యింది. అదే విధంగా యండ‌మూరి రాసిన ప‌లు న‌వ‌ల‌లు అభిలాష‌, ఛాలెంజ్, మ‌ర‌ణ మృదంగం, రాక్ష‌సుడు పేర్ల‌తో సినిమాలుగా వ‌చ్చాయి. ఇక యండ‌మూరి స్వ‌యంగా స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్, అగ్నిప్ర‌వేశం, దుప్ప‌ట్లో మిన్నాగు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ఆయ‌న న‌ల్లంచు తెల్లచీర పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఊర్వ‌శి ఓటీటీ స‌మ‌ర్ప‌ణ‌లో సంధ్య స్టూడియోస్ – భీమ‌వ‌రం టాకీస్ ప‌తాకాల‌పై ర‌వి క‌న‌గాల‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ దీనిని నిర్మించ‌బోతున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి. అమర్ కార్యనిర్వాహక నిర్మాత. యండమూరి శైలిలో వినూత్నమైన కథ, కథనాలతో ముస్తాబవుతున్న నల్లంచు తెల్లచీర ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అమీర్, కూర్పు: మీర్, సంగీతం: తాళ్ళూరి నాగరాజు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-