అక్షయ్ కుమార్ చిత్రంలో కథానాయికగా కొత్త పెళ్లికూతురు!

ఓ సినిమా హిట్టైతే దానికి సీక్వెల్ తీయటంలో బాలీవుడ్ యమ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే, ‘ఓ మై గాడ్’ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్ చేయటంలో కొంత ఆలస్యం అయిందనే చెప్పాలి. కానీ, అక్షయ్ కుమార్ స్టారర్ సొషల్ సెటైర్ కి ఇప్పుడు న్యూ ఇన్ స్టాల్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివిధ లొకేషన్స్ లో షూట్ చేస్తారట. ఇక ప్రధాన పాత్రల్లో గతంలో అక్షయ్ తో పాటూ పరేశ్ రావల్ కనిపించాడు. ఈసారి ఆయన టీమ్ లో ఉండటం లేదు. అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా మళ్లీ నటిస్తుండగా పంకజ్ త్రిపాఠీ ‘ఓ మై గాడ్ 2’లో భక్తుడిగా కనిపిస్తాడు.

‘ఓ మై గాడ్ 2’ మూవీకి డైరెక్టర్ కూడా మారిపోతున్నాడు. తాజా చిత్రానికి దర్శకుడెవరో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, గత చిత్రాన్ని రూపొందించిన ఉమేశ్ శుక్లా సీక్వెల్ కి దూరంగా ఉంటున్నాడు. మరో వైపు, ఈ మధ్యే డైరెక్టర్ ఆదిత్య దర్ ని పెళ్లాడిన యమీ గౌతమ్ ‘ఓ మై గాడ్ 2’లో కథానాయికగా నటిస్తుందని అంటున్నారు. ఆమె పాత్ర ఎలా ఉంటుందని కూడా ఇంకా ఎటువంటి సమాచారం లేదు. చూడాలి మరి, అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్ 2’ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-