స్మార్ట్ ఫోన్స్ డొనేట్ చేయమంటోన్న యమీ గౌతమ్!

కరోనా తెచ్చిన అనేక మార్పుల్లో ఆన్ లైన్ లర్నింగ్ కూడా ఒకటి. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉండిపోవటంతో స్మార్ట్ ఫోన్ ల ద్వారా స్మార్ట్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అవుతోంది. కానీ, దేశంలో ఇంకా చాలా మంది పేద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేవు. అందువల్ల వాళ్లు ఆన్ లైన్ శిక్షణకి దూరమవుతున్నారు. ఇకపై దూరవిద్యకి పేద విద్యార్థులు దూరం కావద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి తెర తీసింది. ఎవరి వద్దనైతే ఎక్స్ ట్రా స్మార్ట్, స్పేర్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయో వారు ప్రభుత్వానికి డోనేట్ చేయవచ్చు! ఆ ఫోన్స్ వాటి అవసరం ఉన్న అర్హులైన విద్యార్థులకి అందజేయబడతాయి…

హిమాచల్ సర్కార్ ప్రారంభించిన కార్యక్రమం పేరు… ‘బచ్చోంకా సహారా ఫోన్ హమారా’. ఈ ‘స్మార్ట్’ ఇనిషియేటివ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యమీ గౌతమ్ వ్యవహారించనుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ హిమాచల్ ప్రభుత్వం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆన్ లైన్ విధానంలో పాల్గొంది. ‘బచ్చోంకా సహారా ఫోన్ హమారా’ని హిమాచల్ సీఎం సమక్షంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మొదలు పెట్టారు. యమీ గౌతమ్ ప్రజలందరికీ తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్స్ పేద విద్యార్థుల చదువు కోసం డొనేట్ చేయమని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఫోన్ డొనేషన్ ఇనిషియేటివ్ లో తానూ భాగమైనందుకు ట్విట్టర్ లో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-