‘లాస్ట్’… క్రైమ్ రిపోర్టర్ యామీ గౌతమ్ చుట్టూ తిరిగే కథ!

బాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ కి గోల్డెన్ పీరియడ్ నడుస్తోందనే చెప్పాలి! ఒకప్పుడు కథానాయికలు కేవలం పాటలు, సెంటిమెంట్ సీన్లకే పరిమితం అయ్యే వారు. కానీ, రైట్ నౌ… కంగనా రనౌత్ మొదలు విద్యా బాలన్ దాకా చాలా మంది హీరోయిన్స్ బాక్సాఫీస్ ని తమ స్వంత క్రేజ్ తో శాసిస్తున్నారు. ఆ కోవలోకి చేరేందుకు తను కూడా రెడీ అవుతోంది యామీ గౌతమ్!

ఈ మధ్యే దర్శకుడు ఆదిత్య దర్ ను పెళ్లాడిన మిసెస్ యామీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఆమే ప్రధాన ఆకర్షణగా ‘లాస్ట్’ అనే థ్రిల్లర్ రూపొందబోతోంది. యామీ గౌతమ్ క్రైమ్ రిపోర్టర్ గా నటించనున్న సినిమాకి అనిరుధ రాయ్ చౌదరీ దర్శకుడు. మీడియా నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ మూవీని చాలా వరకూ కోల్ కతాలో షూట్ చేయనున్నారు. యామీ గౌతమ్ కాకుండా పంకజ్ కపూర్, రాహుల్ ఖన్నా, నీల్ భూపాలమ్, పియా బాజ్ పాయ్, తుషార్ పాండే సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చూడాలి మరి, పెళ్లి తరువాత యామీ చేస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ ‘లాస్ట్’ ఆమెకు ఎలాంటి ఇమేజ్ సంపాదించి పెడుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-