ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడ ‘యాస్’ తుఫాన్..

ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడుతుంది అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’. ధమ్ర పోర్ట్ కు సమీపంలో తీరాన్ని తాకిన అతి తీవ్ర తుఫాన్… మధ్యాహ్నం తర్వాత బాలాసోర్-ధమ్ర పోర్ట్ మధ్య తీరం దాటనుంది అతితీవ్ర తుఫాన్. 9 ఒడిషాజిల్లాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే అక్కడ రెడ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. ఈ తుఫాన్ కారణంగా బెంగాల్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ధమ్ర పోర్ట్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. యాస్ అతితీవ్ర తుఫాన్ ప్రభావంతో గంటకు గరిష్టంగా 150కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.20సెంటీమీటర్ల పైగా వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రకు దాదాపు తప్పింది యాస్ తీవ్ర తుఫాన్ ముప్పు. అయితే తుఫాన్ కరాంగా అల్లకల్లోలంగా మారిన సముద్రంలో గంటకు 50కి.మీ వేగంతో గాలులు వీస్తుండగా… భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-